గురువారం 09 జూలై 2020
Cinema - Jun 06, 2020 , 14:47:31

ర‌విబాబు ఫ‌న్నీ వీడియో..ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతున్న‌ నెటిజన్స్

ర‌విబాబు ఫ‌న్నీ వీడియో..ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతున్న‌ నెటిజన్స్

న‌టుడు, ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటిన ర‌విబాబు త‌న‌కంటూ ప్ర‌త్యేక శైలిని ఏర్ప‌ర‌చుకున్నాడు. పందితో అదుగో అనే సినిమా చేసి అంద‌రి దృష్టిని త‌న వైపుకు తిప్పుకున్నాడు. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన ర‌విబాబు త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ ప్ర‌త్యేక వీడియోలు చేశారు. ఇవి ప్ర‌జ‌ల‌కి సందేశంతో పాటు వినోదం అందించాయి.

తాజాగా ఓ షాపింగ్ మాల్‌కి వెళ్లిన ర‌విబాబుని సెక్యూరిటీ గార్డ్ త‌న ద‌గ్గ‌ర ఉన్న థ‌ర్మ‌ల్ స్కాన‌ర్‌తో టెంప‌రేచ‌ర్ చెక్ చేశాడు . వెంట‌నే ర‌విబాబు కూడా త‌న జేబులో ఉన్న థ‌ర్మ‌ల్ స్కాన‌ర్‌ని తీసి సెక్యూరిటీ గార్డ్ టెంప‌రేచ‌ర్ చెక్ చేశాడు. ఇతరుల భద్రత కోసం తనిఖీ చేయడమే కాదు .. సొంత‌ భద్రత కోసం రవిబాబు ఉష్ణోగ్రతని చెక్ చేయ‌డం నెటిజ‌న్స్‌కి ఎంతో హాస్యాన్ని పంచుతుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. 


logo