శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 26, 2020 , 10:39:44

కేజీఎఫ్ 2 నుండి ర‌వీనా టాండ‌న్ లుక్ విడుద‌ల‌

కేజీఎఫ్ 2 నుండి ర‌వీనా టాండ‌న్ లుక్ విడుద‌ల‌

కన్నడ చిత్రసీమతో పాటు దక్షిణాది సినీపరిశ్రమ స్థాయిని మరో మెట్టు పైకెక్కించిన చిత్రం ‘కేజీఎఫ్‌’. పీరియాడిక‌ల్ మూవీగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించారు. య‌శ్ హీరోగా న‌టించారు.  కన్నడలో రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన తొలి సినిమాగా రికార్డు సొంతం చేసుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ తెర‌కెక్కుతుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ అధీరా పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ర‌వీనా టాండ‌న్ ..ర‌మికా సేన్ అనే పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

ఈ రోజు ర‌వీనా టాండ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కేజీఎఫ్ 2 చిత్ర యూనిట్ సినిమాలో లుక్ విడుద‌ల చేసింది. ఇందులో ర‌వీనా ఎర్ర‌టి చీర ధ‌రించి అసెంబ్లీలో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు. ర‌వీనా లుక్ అభిమానులనే కాదు సినీ ప్రేక్ష‌కుల‌ని కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.  గ‌రుడ‌ని హ‌త్య చేసి న‌రాచిలో తన సామ్రాజ్యాన్ని రాఖీ ఎలా బిల్డ్ చేసుకున్నాడు?.. ఎలా న‌రాచీకి కింగ్‌గా మారాడ‌న్న అంశాల నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా రెండ‌వ పార్ట్‌ని రూపొందిస్తున్నారు.