అనిల్, సుభాంగి పంత్, విరాజ్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘రావే నా చెలియా’. మహేశ్వర్‌రెడ్డి దర్శకుడు. నెమలి సురేష్ నిర్మించారు. ఈ నెల 13న ప్రేక్షకులముందుకురానుంది. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘అందమై న ప్రేమకథా చిత్రమిది. ప్రేమ ప్రయాణంలోని మధుర భావనలకు అద్దం పడుతుంది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా అందరిని మెప్పిస్తుంది. థియేటర్స్‌లోనే ఈ సినిమాను విడుదల చేయబోతు న్నాం’ అన్నారు. ప్రతి ఒక్కరికి తమ తొలిప్రే మ రోజుల్ని గుర్తుకు తె చ్చే చిత్రమిదని కథానాయిక సుభాంగిపంత్ చెప్పింది. కవిత, రఘు, రచ్చ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్‌ఠాగూర్, సంగీతం: కుమార్, సంభాషణలు: మల్లేశ్వర్ బుగ్గ, కథ, దర్శకత్వం: మహేశ్వరరెడ్డి.