e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News త‌మిళ హీరో టాలీవుడ్ ఎంట్రీ..హీరోయిన్ గా క‌న్న‌డ భామ‌

త‌మిళ హీరో టాలీవుడ్ ఎంట్రీ..హీరోయిన్ గా క‌న్న‌డ భామ‌

ట్రెండ్ మారింది..టాలీవుడ్‌ హీరోలు త‌మిళ సినిమాలు, కోలీవుడ్ హీరోలు తెలుగు సినిమాల‌పై ఫోక‌స్ పెట్టడం షురూ చేస్తున్నారు. రీసెంట్ గా శేఖ‌ర్ క‌మ్ముల‌తో కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ తెలుగు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో త‌మిళ హీరో కూడా ధ‌నుష్ బాట‌లోనే ప‌య‌నించేందుకు రెడీ అయ్యాడు. జాతి ర‌త్నాలు డైరెక్ట‌ర్ కేవీ అనుదీప్ తో శివ‌కార్తీకేయ‌న్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

తెలుగు, త‌మిళ భాష‌ల్లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో క‌న్న‌డ భామ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా ఫైన‌ల్ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. సీనియ‌ర్ నిర్మాత‌లు నారాయ‌ణ్ దాస్ నారంగ్‌, పీ రామ్మోహ‌న్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో వ‌న్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా కొన‌సాగుతుంది క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్నా. ఇటీవలే సుల్తాన్ సినిమాతో త‌మిళ ఇండ‌స్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం హిందీలో ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది ర‌ష్మిక‌.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

రూ.25 ల‌క్ష‌లు గెలుచుకున్న రాంచ‌రణ్

‘రామారావు’తో వేణు గ్రాండ్ క‌మ్‌బ్యాక్

అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా బిగ్ బాస్ బ్యూటీ

రాజ్ కుంద్రా బెయిల్ తిర‌స్క‌ర‌ణ‌..గెహ‌నా వ‌శిష్ఠ్ పై కేసు

షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్‌..!

త‌రుణ్‌, ఉద‌య్‌కిర‌ణ్‌తో న‌న్ను పోల్చొద్దు: వ‌రుణ్ సందేశ్‌

ప్రియ‌మణి-ముస్త‌ఫారాజ్ వివాహం చెల్ల‌దు..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana