శనివారం 04 జూలై 2020
Cinema - Jun 04, 2020 , 14:42:06

మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజ్‌పై ర‌ష్మిక‌..చిన్న‌నాటి లుక్

మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజ్‌పై ర‌ష్మిక‌..చిన్న‌నాటి లుక్

ఈ ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ చిత్రాల‌తో మంచి హిట్స్‌ని త‌న ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ ర‌ష్మిక‌. లాక్‌డౌన్ వ‌ల‌న సినిమా షూటింగ్స్ లేక ఇంటికే పరిమిత‌మైన ఈ అమ్మ‌డు త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా జ్ఞాప‌కాల‌ని గుర్తు చేసుకుంటుంది. తాజాగా త‌న చిన్న‌త‌నం ఫోటోని షేర్ చేసి ఫ్యాన్స్‌కి థ్రిల్ క‌లిగించింది.

2001లో ర‌ష్మిక ఫోటో మ్యాగ‌జైన్ క‌వర్ పేజ్‌పై ప్ర‌చురించ‌బ‌డింది. ఇది త‌న తొలి మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజ్ అని చెప్పుకొచ్చింది ర‌ష్మిక‌. ఆ ఫోటోషూట్ నాకు ఇప్ప‌టికీ గుర్తుంది. మా మామ్ అప్ప‌టి పత్రిక‌ని అలా దాచింది. ఇప్ప‌టికీ ప్ర‌తి మ్యాగ‌జైన్‌ని దాస్తూనే ఉంది. మీ ప్రేమ‌ని పొందేందుకు ఈ రోజు నేను ఇక్క‌డ ఇలా ఉన్నాను. ఇది ఆశ్చ‌ర్యంగా ఉంది.  ఇది నా జీవితం అని నేను సంతోషిస్తున్నాను . నా స్నేహితులు, కుటుంబాలు, జీవితంలో జ‌రిగిన విష‌యాలు , నేను ప‌నిచేసిన వారు ఇలా ప్ర‌తి ఒక్క‌రిని ప్రేమిస్తున్నాను అని ర‌ష్మిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది.


 


logo