కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కొంతకాలంగా వరుస సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉంది. ఈ భామ ప్రస్తుతం వివిధ భాషల్లో సినిమాలు చేస్తుంది. రష్మిక ఖాతాలో మిషన్ మజ్ను (Mission Majnu), గుడ్ బై హిందీ సినిమాలున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబైలో ఓ అపార్ట్ మెంట్ కొనుగోలు చేసింది కన్నడ సోయగం. ముంబై (Mumbai)లోని సొంతింట్లో ఉంటూనే మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాల షూటింగ్స్ లో పాల్గొన్నది. చిట్ చాట్ లో రష్మిక ఆసక్తికర విషయం ఒకటి అందరితో పంచుకుంది.
‘నా వృత్తి కారణంగా చాలా ప్రయాణం చేస్తుంటా. ప్రస్తుతం నాకు ముంబైలో ఇల్లు ఉంది. ఇంటి నుంచి షూటింగ్ వెళ్లి రావడం చాలా బాగుంది. హోటళ్లలో ఎక్కువ కాలం ఉండాలంటే నా వల్ల కాదు. ముంబైలో కొనుగోలు చేసిన ఇంటికి ఇంటీరియర్ డిజైన్ పనులు తానే చేసుకున్నట్టు చెప్పింది రష్మిక. కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్తూ..చెల్లెకు నాకు మధ్య 16 ఏళ్ల గ్యాప్ ఉంటుంది. చెల్లెకు నేను రెండో తల్లిలాంటిదాన్నినంటూ’ చెప్పుకొచ్చింది.
రష్మిక ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ తో కలిసి పుష్ప సినిమా చేస్తోంది. సుకుమార్ డైరెక్షన్ లో ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తోంది పుష్ప. రెండు పార్టులుగా తెరకెక్కుతోందీ చిత్రం.
Vijay Deverakonda | బాక్సింగ్ రింగ్ లో విజయ్ దేవరకొండ..లైగర్ స్టిల్ వైరల్
Nani | షాహిద్ కపూర్ గొప్ప నటుడు..రీమేక్ అద్భుతం
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!