టాలీవుడ్ లో ఉన్న యువ హీరోయిన్లలో ఒకరు రష్మికమందన్నా. ప్రస్తుతం ఈ భామ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. సోషల్‌మీడియాలో ఏదో పోస్ట్‌తో నెటిజన్లను పలుకరించే రష్మిక తాజాగా హోలీ సందర్భంగా తనకొచ్చిన సీక్రెట్ గిఫ్ట్ ను ఫాలోవర్లతో షేర్ చేసుకుంది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా..? ఉంగరం. వేలికి ఉంగరం తొడిగిన రష్మిక.. ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
‘నువ్వు పంపిన దాన్ని నేను పొందాను. నేను ఈ కానుక అందుకున్నానని, పంపిన వారు తెలుసుకోండి. నేను మీ రహస్య సంక్షిప్త సందేశాన్ని చదివాను. ఆ సందేశాన్ని నేను ప్రేమిస్తున్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది రష్మిక. ఇంతకీ రష్మికకు రింగ్ పంపిన వ్యక్తి..ఆమె బాయ్ ఫ్రెండా..? ఇంకెవరైనా అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.
రష్మిక తెలుగులో నటిస్తున్న పుష్ప షూటింగ్ దశలో ఉంది. తమిళంలో కార్తీతో కలిసి నటించిన సుల్తాన్ విడుదలకు ముస్తాబవుతుంది. ఇది రష్మికకు కోలీవుడ్ డెబ్యూట్ మూవీ. మరోవైపు మిషన్ మజ్ను చిత్రంతో బాలీవుడ్లో కూడా తొలి సినిమా చేస్తోంది.