శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 02, 2020 , 23:56:16

నిరీక్షిస్తేనే మంచివాడొస్తాడు

నిరీక్షిస్తేనే మంచివాడొస్తాడు

సాధారణంగా కథానాయికల ప్రేమ వ్యవహారాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. సోషల్‌మీడియాలో నాయికలకు ఎదురయ్యే ప్రశ్నల్లో ఎక్కువగా ప్రణయబంధాలకు సంబంధించినవే ఉంటాయి. మీరు సింగిల్‌గా ఉన్నారా?పెళ్లెప్పుడు చేసుకుంటారు? అంటూ అభిమానులు తరచుగా నాయికల్ని అడుగుతుంటుంటారు. అలాంటి ప్రశ్నలే కూర్గ్‌ ముద్దుగమ్మ రష్మిక మందన్నకు ఎదురవుతున్నాయట. తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు తాను సింగిల్‌ ఉన్నానంటూ సమాధానమిచ్చింది రష్మిక మందన్న. ఏకాంత జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నానంటూ చెప్పింది. ‘సింగిల్‌గా ఉండి మనల్ని మనం ఎక్కువగా ఇష్టపడాలి. అప్పుడే మన జీవితంలోకి మంచివాడొస్తాడు.  విలువైన భాగస్వామి తోడు దొరుకుతుంది. ఏకాంతంతో కూడిన నిరీక్షణలో అపరిమితమైన ఆనందం ఉంది’ అని రష్మిక మందన్న తెలిపింది. మరో ప్రశ్నకు బదులిస్తూ అవకాశం లభిస్తే దివంగత మహానటి శ్రీదేవి బయోపిక్‌లో నటించాలనుంది అంటూ బదులిచ్చింది. 


logo