ఛలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. తన టాలెంట్‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ తమిళం, హిందీ పరిశ్రమలలోను వరుస ఆఫర్స్ అందుకుంటున్న రష్మిక ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ లో హీరోయిన్ గా చేస్తుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా కనిపించనుందని తెలుస్తుంది.
లాక్డౌన్ వలన సినిమా షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికి పరిమితమైన రష్మిక పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక వేళ మీరు డేటింగ్ కు వెళ్లాలనుకుంటే ఏ హీరోతో వెళ్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకు రష్మిక స్పందిస్తూ… రెబల్ స్టార్ ప్రభాస్ తో డేట్ కు వెళ్లాలనుకుంటున్నానని చెప్పింది. ప్రభాస్ కు తాను పెద్ద ఫ్యాన్ నని చెప్పింది ఈ కన్నడ భామ.