శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 21, 2020 , 12:46:58

మంచి పేరు చెప్పండంటున్న ర‌ష్మిక‌

మంచి పేరు చెప్పండంటున్న ర‌ష్మిక‌

లాక్‌డౌన్ స‌మ‌యంలో సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫ్యాన్స్‌తో ప‌లు విష‌యాలు ముచ్చ‌టిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ర‌ష్మిక అన్‌టోల్డ్ ర‌ష్మిక అనే హ్యాష్ ట్యాగ్‌తో తన లైఫ్‌లో జ‌రిగిన అనేక విష‌యాల‌ని పంచుకుంది. ఇందులో భాగంగా వారికి ఒక ప్ర‌శ్న కూడా వేసింది. నేను పేరు మార్చుకోవ‌ల‌సి వ‌స్తే మీరు ఏ పేరు సజెస్ట్ చేస్తారని అడిగింది.

ర‌ష్మిక ప్ర‌శ్న‌కి నెటిజ‌న్స్ క్విక్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఆమె న‌టించిన సినిమాల‌లోని పాత్ర‌ల పేర్లు చెబుతూ ఇవైతే బాగుంటాయి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. మ‌రి అభిమానులు చెప్పిన పేర్ల‌లో ర‌ష్మిక‌కి ఏ పేరు బాగా న‌చ్చుతుందో మ‌రి..! ఈ ఏడాది సరిలేరు నీకెవ్వ‌రు, భీష్మ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ఈ అమ్మ‌డు త్వ‌ర‌లో పుష్ప‌తో ప‌ల‌క‌రించ‌నుంది. 


logo