కొవిడ్-19 సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్‌కు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కరోనా బారి నుంచి బయటపడటంలో ప్రాణవాయువు పాత్ర ఎంతో కీలకం. ఈ ఆక్సిజన్ పంపిణీ ఎలా జరుగుతుంది? ఇది ఎన్ని రకాలుగా రోగికి సరఫరా చేస్తారు? ఏ పరిస్థితిలో ఎంత మోతాదులో అందిస్తారు? అన్న అంశాలపై చాలా సందేహాలున్నాయి. ఆక్సిజన్ అంటే సినిమాల్లో చూపించినట్టు ఏదో చిన్న పైప్ పెడితే సరిపోదు. రోగి పరిస్థితి తీవ్రతను బట్టి ఆక్సిజన్ సరఫరాను చాలా పద్ధతుల్లో చేస్తారు.
నాసల్ కాన్యూలా
పేషెంట్ సాచురేషన్ రేటు 88 నుంచి 94 మధ్యలో ఉంటే నాసల్ కాన్యూలా ద్వారా ఆక్సిజన్ అందిస్తారు. ఇందులో నిమిషానికి రెండు నుంచి ఆరు లీటర్ల ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ఇది ఫంక్షన్ ఆఫ్ ఇన్స్ర్పైడ్ ఆక్సిజన్ (ఎఫ్ఐవోటు) 40% వరకు పెంచుతుంది.
హుడ్సన్స్ ఆక్సిజన్ మాస్క్
సాచురేషన్ రేటు 80 నుంచి 88 మధ్యలో ఉంటే మాస్క్‌తో ఆక్సిజన్ అందజేస్తారు. దీన్నే హుడ్సన్స్ ఆక్సిజన్ మాస్క్ అని అంటారు. దీని ద్వారా 5 నుంచి 10 లీటర్ల ఆక్సిజన్ సరఫరా అవుతుంది. దీంతో ఎఫ్ఐవోటు 60% వరకు పెరుగుతుంది.
రీబ్రీతర్ మాస్క్
సాచురేషన్ రేటు 80 కంటే తగ్గితే నాన్ రీబ్రీతర్ మాస్క్ పెడతారు. మాస్క్ వెనకాల బ్యాగ్ లాంటి ఒక కనెక్షన్ (శ్వాస తీసుకున్నప్పుడు ఉబ్బి, వదిలినప్పుడు సాధారణ స్థితికి వస్తుంది) ఉంటుంది. దీనిలో 10 నుంచి 15 లీటర్ల ఆక్సిజన్ సరఫరా చేయొచ్చు. ఎఫ్ఐవోటూ 90% నుంచి 100% పెరుగుతుంది.
ఈసీఎంవో(ఎక్మో)
ఇది సరికొత్త సాంకేతికత. కృత్రిమ ఊపిరితిత్తులు లేదా గుండె లాంటిది. రోగి క్రిటికల్ కండిషన్లో ఉంటే గుండె, ఊపిరితిత్తులు చేయాల్సిన పనిని ఇది చేస్తుంది. ఆక్సిజన్ సరఫరా, రక్తం సరఫరా పనులు చేస్తుంది. ప్రస్తుతం ఈ సాంకేతిక మన వద్ద రెండుమూడు చోట్లనే అందుబాటులో ఉన్నది.
వెంటిలేటర్
షేషెంట్లో కాన్షియస్ లెవల్స్ చాలావరకు పడిపోయి, శ్వాస తీసుకోలేకపోతుంటే, పరిస్థితి చేయి దాటిపోతుందనుకొన్నప్పుడు ఇంక్యూబేట్ చేస్తారు. అంటే లోపలికి ఒక పైప్ లాంటిది వేసి, వెంటిలేటర్‌కు కనెక్ట్ చేస్తారు. దీనిలో పేషెంట్ పరిస్థితిని బట్టి ఆక్సిజన్ అవసరమైన స్థాయిలో సరఫరాచేస్తుంటారు.
సీప్యాప్, బీప్యాప్
లంగ్స్ లోపల అల్వీఓలైవ్ (శ్వాస తీసుకోడానికి ఉపయోగం) కొలాప్స్ అయిన సందర్భంలో పాజిటివ్ ప్రెజర్‌తో ఆక్సిజన్ సరఫరా చేయాలి. దానితో అల్వీ ఓలైవ్ తెరుచుకుంటాయి. ఇందులో సీ ప్యాప్, బై ప్యాప్ అనే రెండు రకాలు ఉంటాయి. సీప్యాప్ (కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్) తో ఆక్సిజన్ సరఫరా చేస్తారు. దీన్నే నాన్ ఇన్వాజివ్ వెంటిలేటర్ అంటారు. అంటే ఇది డైరెక్ట్‌గా ఆక్సిజన్ లోపలికి పంపిస్తుంది. బయటి నుంచి ప్రెజర్ (ఆక్సిజనేషన్) మాత్రమే ఇస్తుంది. ఈ సీప్యాప్లోనూ రెండు రకాలు ఉన్నాయి. కన్వెన్షనల్ కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్, హైప్లో నాసల్ కాన్యూలా ఉంటాయి. దీని ద్వారా 40 – 50 లీటర్ల ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ఎఫ్ఐవోటు 100% వరకు చేయగలుగుతాం.
బై ప్యాప్
సీ ప్యాప్తో పేషెంట్ కోలుకోకపోతే అంటే తీసుకునే శ్వాసతో నీరసించి పోతూ, స్రృహలోనే ఉన్నప్పుడు బై ప్యాప్ (బైలెవల్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెజర్) ద్వారా ఆక్సిజన్ ఇస్తారు. సీప్యాప్ ద్వారా బయటినుంచి మాత్రమే ప్రెజ ర్ వస్తుంది. కానీ బై ప్యాప్లో ఆక్సిజన్ లోపలికి అందించేప్పుడు, బయటకు వచ్చేటప్పుడు ఎయిర్‌వే ప్రెజర్ ఉంటుంది. అంటే ఆక్సిజనేషన్తోపాటు వెంటిలేషన్ రెండూ ఉంటాయి.