బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 26, 2020 , 07:41:15

కుక్క‌ని కాలితో త‌న్నిన వ్య‌క్తి.. ఫైర్ అయిన ర‌ష్మి

కుక్క‌ని కాలితో త‌న్నిన వ్య‌క్తి.. ఫైర్ అయిన ర‌ష్మి

క‌రోనా సంక్షోభం వ‌ల‌న మ‌నుషుల‌తో పాటు మూగ జీవాలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మ‌నుషులు క‌నీసం త‌మ బాధ‌ని చెప్పుకోగ‌ల‌రు. కాని మూగ జీవాలు అవి కూడా చెప్పుకోలేవు. అందుకోసం వాటిని కాపాడుకోవ‌ల‌సిన బాధ్య‌త మ‌న‌దే సినీ సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా ద్వారా వేడుకుంటున్నారు. ఇక యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ అయితే వాటిపై ప్ర‌త్యేక దృష్టి సారించ‌డంతో పాటు వాటి బాగోగులు కూడా చూసుకుంటుంది.

అయితే రీసెంట్‌గా ముంబైలో ఓ వ్యక్తి అటుగా పోతున్న‌ కుక్కను కాలితో తన్నాడు. దీంతో ఆ కుక్క చచ్చిపోయింది. దీని మీద కశ్మీరా పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఆ వ్యక్తి కుక్కను తన్ని వీడియో పక్కన ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియ‌లో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ర‌ష్మీ దృష్టికి వ‌చ్చింది. వెంట‌నే త‌న ట్విట్ట‌ర్ ద్వారా అత‌నిపై చిర్రుబుర్రులాడింది. ‘కుక్క దాని దారిన అది వెళ్తుంటే, ఆయనకేం అయింది. ఆ కుక్కను కొట్టినట్టే అతడిని, అతడికి ఇష్టమైన వాళ్లని కూడా కొట్టాలి. కర్మ వారిని ఏం వదిలిపెట్టదు.’ అని ట్వీట్ చేసింది. అలాగే, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీని ట్యాగ్ చేసి కేవలం మూగ జీవాలను రక్షిస్తే సరిపోదని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు కూడా తీసుకురావాలన్నారు.


logo