ఆదివారం 07 జూన్ 2020
Cinema - Apr 01, 2020 , 09:32:39

క‌న్నీరు పెట్టుకున్న యాంక‌ర్ ర‌ష్మి గౌత‌మ్..

క‌న్నీరు పెట్టుకున్న యాంక‌ర్ ర‌ష్మి గౌత‌మ్..

యాంక‌ర్,న‌టిగా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ర‌ష్మి క‌ష్ట స‌మ‌యాల‌లో త‌నవంతు సాయం చేస్తుండ‌డం మ‌న గ‌మనిస్తూనే ఉన్నాం. ఇటీవ‌ల క‌రోనా స‌హాయ‌క చ‌ర్య‌ల‌లో భాగంగా పీఎం కేర్స్ ఫండ్‌కి రూ.25 వేల రూపాయ‌ల‌ని విరాళంగా ఇచ్చింది. అంతేకాకుండా ఆక‌లితో అల‌మ‌టిస్తున్న కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కి విరాళాలు ఇచ్చిన‌ట్టు కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. అయితే రీసెంట్‌గా  సోష‌ల్ మీడియా ద్వారా లైవ్‌లోకి వ‌చ్చిన రష్మి..లాక్ డౌన్ వ‌ల‌న ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్న మూగ‌జీవాల ప‌రిస్థితిని త‌ల‌చుకొని కంట క‌న్నీరు పెట్టుకుంది.

లాక్‌డౌన్ వ‌ల‌న ప్ర‌జ‌లంద‌రు ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. పేద కార్మికులు, కూలీలు స‌మ‌యానికి తిండి లేక ఇబ్బంది ప‌డుతున్నారు. అలానే మూగ జీవాలు ఆవులు, కుక్క‌లు, పిల్లుల‌ లాంటివి కూడా ఆహారం లేకుండా అల‌మ‌టిస్తున్నాయి. అందుకే ప్ర‌జ‌లంద‌రు మాన‌వ‌తా దృక్ప‌థంతో మూగ‌జీవాల ఆరోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తూ క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. మూగ‌జీవాల కోసం ప‌నిచేస్తున్న కొన్ని స్వ‌చ్చంద సంస్థ‌ల‌కి ఎంతో కొంత సాయం చేయాల‌ని, మీరు ఇచ్చే ఒక రూపాయి కూడా చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. పేద‌ల‌ని కూడా త‌ప్ప‌క ఆదుకోవాల‌ని ర‌ష్మి స్ప‌ష్టం చేసింది.


logo