మంగళవారం 26 మే 2020
Cinema - Apr 30, 2020 , 09:45:05

ర‌ష్మీ బ‌ర్త్ డే ఎలా జ‌రిగిందో తెలుసా ?

ర‌ష్మీ బ‌ర్త్ డే ఎలా జ‌రిగిందో తెలుసా ?

బుల్లితెర యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్.. అతి తక్కువ స‌మ‌యంలో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. సామాజిక స్పృహ ఉన్న ఈ అమ్మ‌డు త‌ర‌చు సామాజిక సేవ‌లు చేస్తుంటుంది. అంతేకాదు మూగ జీవాల‌ని ఎక్కువ‌గా ప్రేమిస్తూ వాటికి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. మూగ జీవాల‌పై ఎవ‌రైన దాడి చేస్తే త‌న‌లోని మ‌రో యాంగిల్‌ని చూపిస్తుంది ర‌ష్మీ. ఇటీవ‌ల జ‌రిగిన సంఘ‌ట‌నే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.

ర‌ష్మీ గౌతమ్ బ‌ర్త్‌డే ఏప్రిల్ 27 కాగా, ఈ సారి లాక్‌డౌన్ వ‌ల‌న తన బ‌ర్త్‌డేని మూగ జీవాల‌తో క‌లిసి జ‌రుపుకుంది. తనకు ఎంతో ఇష్టమైన కుక్కలకు ఆహారం అందించింది.  ఆ త‌ర్వాత ‘హాయ్.. ఇట్స్ మై బర్త్ డే. నా డాగీ ఫ్రెండ్స్.’ అంటూ ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోపై నెటిజ‌న్స్ భిన్న ర‌కాలుగా స్పందిస్తున్నారు 


logo