గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 19, 2020 , 01:54:49

రాశీ తీన్‌మార్‌

రాశీ తీన్‌మార్‌

తెలుగు చిత్రసీమలో విజయవంతమైన జోడీగా పేరుతెచ్చుకున్నారు సాయితేజ్‌, రాశీఖన్నా. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సుప్రీమ్‌', ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాలు కమర్షియల్‌గా చక్కటి వసూళ్లను సాధించాయి. సాయితేజ్‌, రాశీఖన్నా మూడో సారి కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాయితేజ్‌ కథానాయకుడిగా దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనున్నది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. ఇద్దరూ కథానాయికలకు చోటున్న ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా నివేథా పేతురాజ్‌ను చిత్రబృందం ఎంపికచేసింది. మరో నాయికగా రాశీఖన్నాను తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే దర్శకుడు దేవాకట్టా ఆమెను కలిసి కథను  వినిపించినట్లు తెలిసింది. రాశీఖన్నా ఈసినిమాలో  నటించడానికి సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు.  ప్రస్తుతం రాశీఖన్నా తమిళంలో ‘అరాన్మణై-3’లో కథానాయికగా నటిస్తున్నది.


logo