శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 23:29:56

అచ్చమైన పల్లెటూరి పడుచందం

అచ్చమైన పల్లెటూరి పడుచందం

అందాలన్ని రాశిగా పోసి పరువాల తరాజులో తూకం వేస్తే ఆ ముగ్ధసౌందర్యం రాశీఖన్నా రూపంలో సాక్షాత్కరిస్తుంది. బాపు బొమ్మలా చూడముచ్చటైన రూపంతో అలరారే ఈ పంజాబీ సోయగానికి యువతరంలో అభిమానులు ఎక్కువ. ఇటీవలకాలంలో వరుస ఫొటోషూట్స్‌తో సోషల్‌మీడియాలో సందడిచేస్తోందీ భామ. తాజాగా సంప్రదాయ లంగావోణిలో అందాల్ని ఒలకబోస్తూ రాశీఖన్నా పోస్ట్‌ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. కొంటె చూపులతో సిగ్గుల మొగ్గవుతూ..అల్లరినవ్వులతో కవ్విస్తున్న ఈ ఫొటోల్లో రాశీఖన్నా ద్విగుణీకృతమైన అందంతో కనిపిస్తోంది. ‘అచ్చ తెలుగందానికి అసలైన చిరునామాగా ఉన్నావు’ ‘నీ అమాయకపు చూపులతో మా హృదయాల్ని దోచేస్తున్నావ్‌' ‘స్వచ్ఛమైన  పల్లెటూరి పడుచందం’ అంటూ అభిమానులు ఈ ఫొటోలపై కామెంట్స్‌ పెడుతున్నారు. ప్రస్తుతం రాశీఖన్నా తమిళంలో ఓ చిత్రంలో నటిస్తోంది.logo