పంజాబీ సొగసరి రాశీఖన్నా సినిమాల వేగాన్ని పెంచింది. ప్రస్తుతం తెలుగులో ‘పక్కా కమర్షియల్’ ‘థాంక్యూ’ చిత్రాలతో బిజీగా ఉంది. తమిళంలో సుందర్ సి దర్శకత్వంలో ‘ఆరణ్మనై-3’ చిత్రంలో నటిస్తోంది. ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చెన్నైలో ప్రారంభమైంది. నాయకానాయికలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో రాశీఖన్నా గ్లామర్ పాత్రలో కనిపించనుంది. ఈ సందర్భంగా ట్విట్టర్లో ఓ ఫొటోను షేర్ చేసింది రాశీఖన్నా. సరికొత్త ‘ఆరణ్మనై-3’ ప్రపంచానికి స్వాగతం’ అంటూ క్యాప్షన్‌ను జతచేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో అందరిని ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో పాటు రాశీఖన్నా హిందీలో రాజ్-డీకే దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. తమిళంలో కార్తి సరసన ‘సర్దార్’లో నాయికగా నటిస్తోంది.