మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 21, 2020 , 17:32:20

లాయర్ నుంచి కంగ‌నాకు ' రేప్ థ్రెట్స్ ' ..!

లాయర్ నుంచి కంగ‌నాకు  ' రేప్ థ్రెట్స్ ' ..!

ఒడిశా లాయ‌ర్ ఒక‌రు బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ కు ఫేస్ బుక్ పోస్టులో  రేప్ థ్రెట్స్ పెట్ట‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఫేస్ బుక్ ఖాతాలో త‌న‌పై అభ్యంత‌ర‌క‌ర‌ కామెంట్లు పెట్ట‌డంతో కంగ‌నా స‌ద‌రు లాయ‌ర్ పై ముంబై పీఎస్ లో ఎఫ్ఆర్ఐ న‌మోదు చేసింది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. 

మ‌నాలీలో న‌వ‌రాత్రి వేడుక‌ల్లో బిజీగా ఉన్న కంగ‌నా ఎఫ్ బీలో ఓ పోస్ట్ పెట్టింది.  'న‌వ‌రాత్రి రోజు అంద‌రూ ఉప‌వాసం ఉంటారు. ఈ ఫొటోలు ఇవాళ దిగిన‌వి. నేను కూడా ఉప‌వాసం ఉన్నా. నాపై మ‌రో కేసు న‌మోదైంది. ప‌ప్పు సేన నా గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న‌ట్టుంది. న‌న్ను అంతలా మిస్ కావొద్దు. త్వ‌ర‌లోనే అక్క‌డికి (ముంబై) వ‌స్తానంటూ ' మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంపై ప‌రోక్షంగా చుర‌క‌లంటించింది. 

ఇదిలా ఉంటే మ‌రోవైపు ఆ లాయ‌ర్ త‌న ఫేస్ బుక్ ఖాతాను డిలీట్ చేశాడు. అయితే ఎఫ్ బీ నుంచి తొల‌గిపోయే ముందు.. 'ఇవాళ సాయంత్రం నా ఫేస్ బుక్ ఐడీ హ్యాఖ్ అయింది. కొన్ని అభ్యంత‌ర‌క‌ర కామెంట్లు పెట్టారు. ఇది ఏ కులాన్ని కానీ, ఏ మ‌హిళ‌ను కానీ ఉద్దేశించి పెట్టిన‌వి కావు. నేను కూడా షాక్ గుర‌య్యాను. ఆ కామెంట్ల‌కు క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నా. ఎవ‌రెవ‌రి మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయో..ద‌యచేసి వారంతా నా క్ష‌మాప‌ణ‌ల‌ను స్వీక‌రించాల‌ని కోరుతున్నా. ఇలా జ‌రిగినందుకు క్ష‌మాప‌ణలు చెబుతున్నా' అని మ‌రో పోస్టు పెట్టాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.