బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 13, 2020 , 19:03:36

ర‌ణ్ వీర్ సింగ్ మొద‌టి ఆడిష‌న్..వీడియో చ‌క్క‌ర్లు

ర‌ణ్ వీర్ సింగ్ మొద‌టి ఆడిష‌న్..వీడియో చ‌క్క‌ర్లు

ర‌ణ్ వీర్ సింగ్..ప్ర‌‌స్తుత‌మున్న బాలీవుడ్ లో ఎంతో క‌ష్ట‌ప‌డి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యాక్ట‌ర్. బాంబే (ప్ర‌స్తుత‌ ముంబై)లో సింధీ కుటుంబంలో జ‌న్మించిన ర‌ణ్ వీర్ సింగ్ ..తొలుత అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేశాడు. న‌టుడ‌వ్వాల‌నే ప‌ట్టుద‌ల‌తో చాలా ఆడిష‌న్స్ కి వెళ్లి నిరాశ చెందాడు. చిన్నచిన్న పాత్ర‌ల కోసం ర‌ణ్ వీర్ కు కాల్స్ వ‌చ్చేవి. చాలా అయోమ‌యంగా ఉంది. నేను చేస్తున్న ప‌ని స‌రైన‌దేనా..? కాదా అని అనిపించేదని ర‌ణ్ వీర్ సింగ్ చెప్పాడంటే ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో అర్థం చేసుకోవ‌చ్చు.

 2010 జ‌న‌వ‌రి లో ర‌ణ్ వీర్ కు టైం క‌లిసొచ్చింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిలింస్ క్యాస్టింగ్ హెడ్ శ‌నూ శ‌ర్మ నుంచి ఆడిష‌న్స్ కు రావాల‌ని ర‌ణ్ వీర్ సింగ్ కు కాల్ వ‌చ్చింది. వెడ్డింగ్ ప్లానింగ్ నేప‌థ్యంలో సాగే రొమాంటిక్ కామెడీ సినిమా బ్యాండ్ బాజా భార‌త్ లో లీడ్ రోల్ కోసం ర‌ణ్ వీర్ ఆడిష‌న్స్ కు హాజ‌ర‌య్యాడు. ఆడిష‌న్స్‌లో వైట్ టీష‌ర్టు వేసుకున్న ర‌ణ్ వీర్ సింగ్ ఓ డైలాగ్ చెప్పాడు. ర‌ణ్ వీర్ ఆడిష‌న్స్ లో పాల్గొ్న్న త్రోబ్యాక్ వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo