ఆదివారం 07 జూన్ 2020
Cinema - Mar 31, 2020 , 18:29:39

లాక్‌డౌన్ ఎఫెక్ట్ ; రోజుకి 20 గంట‌లు నిద్ర‌పోతున్న ర‌ణ్‌వీర్ సింగ్

లాక్‌డౌన్ ఎఫెక్ట్ ; రోజుకి 20 గంట‌లు నిద్ర‌పోతున్న ర‌ణ్‌వీర్ సింగ్

ఏప్పిల్ 14వ తేదీ వ‌ర‌కు వ‌ర్క‌ఫ్ర‌మ్‌హోమ్ చేయ‌లేక, ఇంట్లో పోడు ప‌డ‌లేక కొంత‌మంది త‌మ బాధ‌ను టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. ఇంట్లో ఉండ‌డానికి క‌ష్ట‌ప‌డుతున్నారు ఎందుకు అంటున్న‌ది బాలివుడ్ అందాల భామ దీపికా ప‌దుకునే. దీనికి మా కుటుంబం విరుద్ధం అంటున్న‌ది. ఎందుకంటే లాక్‌డౌన్ స‌మ‌యాన్ని ర‌ణ్‌వీర్ సింగ్ బాగా ఉప‌యోగించుకున్నార‌ని తెలిపింది. ర‌ణ్‌వీర్ అయితే రోజుకి  20 గంట‌లు నిద్ర‌కి కేటాయిస్తున్నాడట. మిగిలిన 4 గంట‌లు భార్యాభ‌ర్త‌లిద్ద‌రు క‌లిసి రోజుకో సినిమా చూస్తున్నారట‌. అందులో అస్కార్ అందుకున్న సినిమాల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని దీపిక తెలిపింది.

ర‌ణ్‌వీర్ నిద్ర‌పోతున్న స‌మ‌యంలో దీపికా మాత్రం వంట‌గ‌దికి ప‌రిమిత‌మై ప‌నుల‌న్నీ చ‌క‌చ‌కా నేర్చుకుంటున్న‌ది. భార‌తీయుల వంట నేర్చ‌కునేందుకు సిద్ధ‌మైంది. ముఖ్యంగా వంట‌ల్లో వాడే  ధ‌నియాలు, పుదీనా, గోధుమ‌పిండి వంటి వాటి తేడాలు తెలుసుకునే ప‌నిలో ఉన్న‌ది దీపికా. అంతేకాదు ఆమెకు జోజో రాబిట్ అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. లాక్‌డౌన్ స‌మ‌యంలో బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఈ విధంగా ఉప‌యోగించుకుంటున్న‌దీపికా ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్న‌ది. 


logo