ఆదివారం 07 జూన్ 2020
Cinema - Apr 05, 2020 , 15:22:22

భ‌ర్త కోసం వెరైటీ వంట‌కాలు చేసిన దీపికా ప‌దుకొణే

భ‌ర్త కోసం వెరైటీ వంట‌కాలు చేసిన దీపికా ప‌దుకొణే

బాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ ర‌ణ్‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొణే ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. లాక్ డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన వీరిద్ద‌రు ఖాళీ స‌మ‌యాన్ని చ‌క్క‌గా వినియోగించుకుంటున్నారు. ర‌ణ్‌వీర్ సింగ్ ఎక్కువ సేపు నిద్ర‌కి ఉప‌క్ర‌మిస్తుండ‌గా, దీపికా భార‌తీయ వంట‌ల‌ని నేర్చుకునే ప‌నిలో ప‌డింది. అంత‌క ముందు ప‌ప్పు దిన‌సుల పేర్లు, వాటిని ఎలా ఉప‌యోగించాలో నేర్చుకుంది. 

త‌న కోసం ఎంతో ప్రేమ‌తో దీపికా ప‌దుకొణే చేసిన వంట‌ల‌ని ర‌ణ్‌వీర్ సింగ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ఇది చూస్తుంటే  చక్కటి రెస్టారెంట్ లో ఏర్పాటు చేసిన భోజ‌నం మాదిరిగా  క‌నిపిస్తున్నాయ‌ని నెటిజ‌న్స్ అంటున్నారు. విందు మెనూలో మిర‌ప రేకులు, జున్ను, ట‌మాటో సాస్‌తో కూడిన ఫుసిల్లి పాస్తా, వెల్లుల్లి రెట్టె, ఇటాలియ‌న్ స్టైల్ లో చికెన్ త‌దిత‌రమైన నోరూరించే వంట‌లు ఉన్నాయి. త‌క్కువ టైంలో ఇంత అందంగా వంట‌లు చేసిన దీపికాని ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంసిస్తున్నారు logo