శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Mar 03, 2020 , 08:36:04

ర‌ణ్‌వీర్ సింగ్ బాట‌లో హృతిక్.. వైర‌ల్‌గా మారిన పిక్

ర‌ణ్‌వీర్ సింగ్ బాట‌లో హృతిక్.. వైర‌ల్‌గా మారిన పిక్

బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌వీర్ సింగ్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స‌మ‌యానుగుణంగా ర‌ణ్‌వీర్ వెరైటీ డ్రెస్సుల‌లో ద‌ర్శ‌న‌మిస్తూ అభిమానుల దృష్టిని ఆక‌ర్షిస్తుంటాడు. ఇప్పుడు ర‌ణ్‌వీర్ సింగ్‌ని ఆద‌ర్శంగా తీసుకున్న బాలీవుడ్ యాక్ష‌న్ హీరో హృతిక్ రోష‌న్ స‌రికొత్త గెట‌ప్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. రెడ్ టీ ష‌ర్ట్ ధ‌రించిన హృతిక్ తెల్ల‌టి ట‌వ‌ల్‌ని లుంగీలా క‌ట్టుకున్నాడు. త‌ల‌కి బ్లాక్ క్యాప్ పెట్టాడు. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోల‌ని పోస్ట్ చేసిన హృతిక్ ర‌ణ్‌వీర్ సింగ్ ఇన్సిపిరేష‌న్‌తోనే ఇలాంటి గెట‌ప్‌లోకి మారాన‌ని అన్నాడు. ప్ర‌స్తుతం హృతిక్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ఫోటోలో హృతిక్ కాలుకి బ్యాండేజ్ ఉండ‌డం చూసి ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. 


logo