బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 05, 2020 , 09:38:22

చిన్న‌ప్ప‌టి నుండే స్టైల్‌ని మెయింటైన్ చేస్తున్న ర‌ణ్‌వీర్

చిన్న‌ప్ప‌టి నుండే స్టైల్‌ని మెయింటైన్ చేస్తున్న ర‌ణ్‌వీర్

బాలీవుడ్ ట్రెండ్ సెట్ట‌ర్ ర‌ణ్‌వీర్ సింగ్ ఎంత స్టైలిష్‌గా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక్కో ఈవెంట్‌లో ఒక్కో గెట‌ప్‌లో క‌నిపిస్తూ త‌న అభిమానులని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ ఉంటాడు. అయితే లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే ప‌రిమిత‌మైన ర‌ణ్‌వీర్ సోష‌ల్ మీడియా ద్వారా పాత జ్ఞాప‌కాల‌ని గుర్తు చేసుకోవ‌డ‌మే కాక నెటిజ‌న్స్‌కి కూడా కావ‌ల‌సినంత వినోదాన్ని అందిస్తున్న‌డు. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చిన్ననాటి ఫోటో షేర్ చేశాడు.

త‌న చిన్న‌ప్ప‌టి ఫోటోలో ర‌ణ్‌వీర్ తెల్ల‌టి ఫుల్ స్లీవ్ టీ ష‌ర్ట్ ధ‌రించి దానిని జీన్స్‌లోకి ట‌క్ వేశాడు. ఇక ప్యాంట్‌కి బ్రౌన్ బెల్ట్ పెట్టుకొని స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తూ ఫోటోకి ఫోజులిచ్చాడు.  ఈ ఫోటోని చూసిన నెటిజ‌న్స్ ఇంత స్టైలిష్‌గా రెడీ అయ్యే అలవాటు ర‌ణ్‌వీర్‌కి చిన్న‌ప్ప‌టి నుండి ఉందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే త్వ‌ర‌లో 83 చిత్రంతో ప‌ల‌క‌రించ‌నున్న ర‌ణ్‌వీర్ సింగ్ య‌శ్ రాజ్ ఫిలింస్‌తో క‌లిసి జయేశ్‌భాయ్ జోర్దార్ అనే సినిమా చేస్తున్నాడు. అలానే త‌క్త్ అనే చిత్రం అక్ష‌య్ కుమార్ సూర్య‌వంశీ చిత్రంలో క్యామియో రోల్ పోషిస్తున్నాడు.  


logo