బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఏం చేసినా కూడా చినిగి చాటవ్వాల్సిందే. ఆయనొక ట్రెండ్ సెట్టర్. మార్కెట్లో ఏది కొత్తగా వచ్చినా కూడా ప్రయత్నించక మానడు. ఇటీవల వెరైటీ డ్రెస్‌లో కనిపించి సందడి చేసిన రణ్వీర్ సింగ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక జూలై6న తన బర్త్ డేకావడంతో 2 కోట్ల 43 లక్షల విలువైన మెర్సిడిస్ మేబీచ్ జీఎల్ఎస్ 600ను కొనుగోలు చేసి తనకి తానుగా గిఫ్ట్‌గా ఇచ్చుకున్నాడు.
ఈ ఏడాది మేలో లంబోర్గిని యురుస్ పెరల్ క్యాప్సుల్ మోడల్‌ను తన సొంతం చేసుకున్నాడు రణ్వీర్ సింగ్. దీని కోసం రూ.3.15 కోట్లు వెచ్చించాడు. వీటితోపాటు ఈ హీరో దగ్గర ఆస్టన్ మార్టిన్ స్పోర్ట్స్ కారు కూడా ఉంది. దీని కోసం ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. రణ్వీర్ దగ్గర ఉన్న నాలుగు కార్లలో ఈ కారు ధర ఎక్కువ అనే చెప్పాలి. మార్కెట్లోకి ఏ కారు వచ్చినా కూడా వెంటనే రణ్వీర్ కన్ను దానిపై పడుతుంది. ప్రస్తుతం అలియాభట్‌తో కలిసి ‘రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ’ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే స్పోర్ట్స్ డ్రామా ’83’లో క్రికెటర్ కపిల్ దేవ్ పాత్ర పోషిస్తున్నాడు.ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది.
‘జయేశ్‌భాయ్ జోర్దార్’, ‘సర్కస్’, ‘అన్నియన్’, ‘తాకత్’ చిత్రాలలో కూడా రణ్వీర్ నటించనున్నాడు. అలాగే ‘బిగ్ పిక్చర్’ అనే క్విజ్ షో ద్వారా త్వరలోనే బుల్లితెరపై కూడా ఎంట్రీకి సిద్ధమయ్యాడు.