బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Oct 16, 2020 , 09:54:08

ర‌ణ్‌వీర్ కారుని ఢీకొట్టిన బైక‌ర్..దిగి చెక్ చేసుకున్న హీరో

ర‌ణ్‌వీర్ కారుని ఢీకొట్టిన బైక‌ర్..దిగి చెక్ చేసుకున్న హీరో

బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ క‌రోనా వ‌ల‌న కొన్నాళ్ళుగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే కొద్ది రోజులుగా సినిమాకి సంబంధించిన  ప‌నులు మొద‌లు కావ‌డంతో గురువారం డ‌బ్బింగ్ చెప్పేందుకు స్టూడియోకు వెళ్ళారు. డ‌బ్బింగ్ పూర్తైన త‌ర్వాత ఇంటికి వెళుతున‌న స‌మ‌యంలో ఓ బైక‌ర్ ర‌ణ్‌వీర్ కారుని వెనుక నుండి ఢీకొట్టాడు. వెంట‌నే అత‌ను కారు దిగి ఆ డ్యామేజ్ ప్రాంతాన్ని చెక్ చేసుకున్నాడు. 

ర‌ణ్‌వీర్ రోడ్డు మీద‌కు రావ‌డంతో అక్క‌డున్న వారంతో ఆయ‌న‌ని త‌మ కెమెరాలో బంధించారు. ర‌ణ్‌వీర్ కారు దిగి పరిశీలించడం, ఆ వెంటనే మళ్లీ కారెక్కి వెళ్ళిపోవ‌డాన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో అది వైర‌ల్‌గా మారింది. ప్ర‌స్తుతం ర‌ణ్‌వీర్ .. క‌పిల్ బ‌యోపిక్ నేప‌థ్యంలో 83 అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ థియేట‌ర్స్‌లో విడుద‌ల కానుంది.  logo