మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 17, 2021 , 00:51:29

ప్రేమానుబంధాల ‘రంగ్‌దే’

ప్రేమానుబంధాల ‘రంగ్‌దే’

నితిన్‌, కీర్తిసురేష్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్‌ దే’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. సంక్రాంతి సందర్భంగా  ఇటీవల చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది. ఇందులో సంప్రదాయ వస్త్రధారణలో కీర్తిసురేష్‌, ఆధునిక ఛాయలతో నితిన్‌ కనిపిస్తున్నారు. ‘కుటుంబ విలువలతో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రమిది. మార్చి 26న విడుదల చేయనున్నాం. నితిన్‌, కీర్తిసురేష్‌ కలయిక అలరిస్తుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నాం’ అని చిత్రబృందం తెలిపింది.  నరేష్‌, వినిత్‌, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: పీసీ శ్రీరామ్‌. 

VIDEOS

logo