అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం ఒకవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది.రీసెంట్గా సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ విడుదల కాగా, ఇందులో సమంత రోల్ ప్రేక్షకులకి ఆసక్తి కలిగించింది. ఈ వెబ్ సిరీస్ తర్వాత సమంతకు బాలీవుడ్లో ఆఫర్స్ రావడం ఖాయమని తెలుస్తుంది. అయితే జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో రాజీ అనే ప్రతినాయిక ఛాయలున్న పాత్రను సమంత పోషించింది.
జూన్ 4న వెబ్ సిరీస్ విడుదల కానున్న నేపథ్యంలో సమంత ప్రమోషన్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది. ఈ క్రమంలో బాలీవుడ్లో ఏ హీరో సరసన నటించాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా వెంటనే హీరో రణ్‌బీర్ కపూర్‌తో నటించాలనుంది అని చెప్పుకొచ్చింది సమంత. ఇక మనోజ్ బాజ్‌పాయ్ పాత్ర దక్షిణాదిలో ఏ హీరో చేస్తే బాగుంటుందని అడగగా, అందుకు మా మామ నాగార్జున అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత శాకుంతలం అనే సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.