బుధవారం 03 జూన్ 2020
Cinema - May 04, 2020 , 09:43:49

రిషీ సంస్మ‌ర‌ణ స‌భ‌లో రణ్‌బీర్, నీతూ

రిషీ సంస్మ‌ర‌ణ స‌భ‌లో రణ్‌బీర్, నీతూ

బాలీవుడ్ స్టార్ రిషీ క‌పూర్ ఏప్రిల్ 30న ముంబైలోని ఆసుప‌త్రిలో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ వ‌ల‌న కొద్ది మంది స‌మ‌క్షంలోనే ఆయ‌న అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. ఢిల్లీలో ఉన్న రిషీ కూతురు రిద్ధిమా త‌న తండ్రి చివ‌రి చూపుకు నోచుకోలేక‌పోయింది. అయితే శ‌నివారం రాత్రి రిద్ధిమా ముంబైకి రాగా, ఆదివారం కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో ప్రార్ధ‌నా స‌మావేశం నిర్వ‌హించారు. ఆ స‌మావేశంలో రిషీ ఫోటో ప‌క్క‌న కూర్చొని ఉన్న‌ ర‌ణ్‌బీర్ క‌పూర్,నీతూ దిగాలుగా క‌నిపించారు. ప్ర‌స్తుతం రిషీ ఫోటోతో కూర్చొని ఉన్న నీతూ, ర‌ణ్‌భీర్ క‌పూర్‌ల ఫోటో సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుండ‌గా, ఇది చాలా మంది హృదయాలను క‌కావిక‌లం చేస్తుంది


logo