శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Sep 02, 2020 , 20:16:50

బ్ల‌డ్ శాంపిల్స్ ఇచ్చేందుకు ముందుకు రావాలి: క‌ంగ‌నా

బ్ల‌డ్ శాంపిల్స్ ఇచ్చేందుకు ముందుకు రావాలి: క‌ంగ‌నా

సుశాంత్ రాజ్ పుత్ మృతి కేసులో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం బాలీవుడ్ లో చ‌ర్చ‌నీయాంశమ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ యాక్టర్లకు డ్ర‌గ్స్ తో లింక్స్ ఉన్నాయ‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇటీవ‌లే కంగ‌నా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ..డ్ర‌గ్స్ తీసుకోవడంలో చాలా మంది నటీన‌టులు ఇన్వాల్ అయి ఉన్నారు. 99 శాతం బాలీవుడ్ సెల‌బ్రిటీలు డ్ర‌గ్స్ దుర్వినియోగానికి పాల్ప‌డుతున్న‌ట్టు ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. అధికారులు ద‌ర్యాప్తు చేస్తే చాలా పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశ‌ముంటుంది.

ర‌ణ్ బీర్ క‌పూర్‌, ర‌ణ్ వీర్ సింగ్, అయాన్ ముఖ‌ర్జీ, విక్కీ కౌశిక్ ర‌క్త న‌మూనాల‌ను ప‌రీక్ష‌ల‌కు ఇచ్చి డ్ర‌గ్స్ లింక్ పుకార్లుకు చెక్ పెట్టాల‌ని కంగ‌నా ర‌నౌత్ ట్వీట్ చేసింది. వీరంద‌రిపై కొకైన్ కు బానిస‌ల‌య్యార‌న్న పుకార్లున్న నేప‌థ్యంలో..ఆ పుకార్లకు చెఖ్ పెట్టేందుకు ర‌క్త‌ప‌రీక్ష‌ల‌కు ముందుకురావాల‌ని కోరింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo