శనివారం 30 మే 2020
Cinema - May 13, 2020 , 11:24:30

రానా, మిహీకా మ‌రో ఫోటో వైర‌ల్

రానా, మిహీకా మ‌రో ఫోటో వైర‌ల్

లాక్‌డౌన్ స‌మ‌యంలో తాను లాక్ అయిన‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు రానా ద‌గ్గుబాటి. డిజైనర్ మిహీకా బజాజ్ త‌న ప్రేమ‌కి ఓకే చెప్పింద‌ని ఆమెతో క‌లిసి దిగిన ఫోటోని  రానా త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశాడు. దీంతో సెల‌బ్రిటీలందరు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు అందించారు. అభిమానులు మిహీకా గురించి ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారు.

హైదరాబాద్లో పుట్టి పెరిగిన మిహీక... బంటీ- సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె. మిహీకా చెల్సియా విశ్వవిద్యాలయం నుండి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆమె ఇంటీరియర్ డిజైన్ .. డెకార్ బిజినెస్ స్పెషలిస్ట్. డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియోను మిహీక స్వయంగా నడుపుతున్నారు. ఈ సంస్థ వివాహాలు .. ఇతర కార్యక్రమాలను కూడా ప్లాన్ చేస్తుంది. అతి త్వ‌ర‌లోనే వీరి వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే తాజాగా రానా-మిహీకాకి సంబంధించిన మ‌రో ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇందులో ఇద్దరు న‌వ్వుతూ ఫోటోల‌కి ఫోజిచ్చిన‌ట్టు క‌నిపిస్తుంది.

 


logo