శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 01, 2020 , 18:11:12

రానా-శ్రుతి హాస‌న్ కాంబినేష‌న్‌లో రానున్న వెబ్‌సిరీస్‌!

రానా-శ్రుతి హాస‌న్ కాంబినేష‌న్‌లో రానున్న వెబ్‌సిరీస్‌!

రానా ద‌గ్గుబాటి క‌రోనా టైంలోనే ఓ ఇంటి వాడ‌య్యాడు. ఇన్ని రోజులు పెళ్లి ప‌నుల‌తో బిజీగా ఉన్న రానా వెబ్‌సిరీస్ మీద క‌న్నేశాడు. బ‌హుముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తె శ్రుతి హాస‌న్, రానా ద‌గ్గుబాటితో క‌లిసి వెబ్ సిరీస్ కోసం జ‌త‌క‌ట్ట‌నున్నారు. ఈ వెబ్‌సిరీస్ కోసం ప్ర‌ముఖ తెలుగు ద‌ర్శ‌కుడు క‌థ‌ను అదించార‌ని, నెట్‌ఫ్లిక్స్ దీనిని నిర్మించ‌బోతోంద‌ని స‌మాచారం. వెబ్‌సిరీస్‌ను మొద‌టి తెలుగు భాష‌లో చిత్రీక‌రించి త‌ర్వాత బ‌హుళ ప‌ది భాష‌ల్లో విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. ఇది ప‌ది ఎపిసోడ్‌ల థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్‌. దీంతో ప్రేక్ష‌కుల‌కు రోమాలు నిక్క‌పొడుచుకోవ‌డం ఖాయం అంటున్నారు. హిందీలో విడుదల కానున్న 'హఠీ మేరే సాతిగా'  చిత్రంలో రానా దగ్గుబాటి ప్ర‌ధాన పాత్రలో క‌నిపించ‌నున్నాడు. 


logo