యువహీరో రానా తొలిసారి గాత్రదానం చేయబోతున్నారు. తాను కథానాయకుడిగా నటిస్తున్న తా జా చిత్రం ‘విరాటపర్వం’ కోసం ఆయన గాయకుడి అవతారం ఎత్తడానికి సిద్ధమయ్యారు. సందర్భోచితంగా వచ్చే ఓ ప్రత్యేకగీతాన్ని ఆలపించమని చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల కోరగా అందుకు రానా అంగీకరించాని..త్వరలో పాట రికార్డింగ్ చేయబోతున్నారని సమాచారం. సురేష్ బొబ్బిలి ఈ చిత్రాన్ని సంగీతాన్నందిస్తున్నారు. తొలిసారి రానా గీతాలాపన చేయడం సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో రానా నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారు. 1980దశకం తెలంగాణ ప్రాంతంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాకు రూపొందిస్తున్నారు.