సోమవారం 18 జనవరి 2021
Cinema - Nov 15, 2020 , 15:14:26

మిహికా తెరంగేట్రంపై స్పందించిన రానా

మిహికా తెరంగేట్రంపై స్పందించిన రానా

ఈ ఏడాది పెళ్లిపీట‌లెక్కిన రానా- మిహికా దంప‌తులు ప్ర‌స్తుతం త‌మ వైవాహిక జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం హ‌నీమూన్ వెళ్ళి వ‌చ్చిన ఈ జంట ఇప్పుడు  వారి ప‌నుల‌తో  బిజీ అయ్యారు. రానా రీసెంట్‌గా త‌న సోష‌ల్ మీడియా ద్వారా షూటింగ్స్‌లో పాల్గొనేందుకు వెళుతున్న‌ట్టు చెప్పుకొచ్చాడు.

తాజాగా రానా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చాడు. అందులో భాగంగా మిహికా వెండితెర ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. మ‌హికా సినిమా రంగ ప్ర‌వేశం గురించి డిస్క‌ష‌న్ ఎప్పుడు రాలేదు. ప్ర‌స్తుతం త‌న సొంత మేనేజ్‌మెంట్ కంపెనీతో బిజీగా ఉంది అని అన్నారు. రానా మాట‌ల‌ని బ‌ట్టి చూస్తుంటే భ‌విష్య‌త్‌లో ఆమె సినిమాల‌లో న‌టించే అవ‌కాశం కూడా ఉంద‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం అర‌ణ్య‌, విరాట‌ప‌ర్వం చిత్రాల‌తో పాటు సొంత యూట్యూబ్ ఛానెల్‌కు సంబంధించిన ప‌నులతో బిజీగా ఉన్నాడు రానా.