గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 01:05:19

రానా, మిహీక బజాజ్‌ హనీమూన్‌ విహారంలో..?

 రానా, మిహీక బజాజ్‌  హనీమూన్‌ విహారంలో..?

కథానాయకుడు రానా, మిహీక బజాజ్‌ గత ఆగస్ట్‌లో వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. పెళ్లయిన తర్వాత దంపతులిద్దరు కలిసి తొలిసారి తీయించుకున్న ఫొటోను మిహీక బజాజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ‘ఇప్పుడే ఎందుకంటే..’ అనే క్యాప్షన్‌ పెడుతూ రానాను ట్యాగ్‌ చేసింది. ఈ ఫొటోలో కొత్త జంట హనీమూన్‌ విహారంలో ఉన్నట్లు కనబడుతోంది. కరోనా ప్రభావం వల్ల వివాహనంతరం రానా, మిహీక దంపతులు హనీమూన్‌కు ప్లాన్‌ చేసుకోలేదు. ప్రస్తుతం పరిస్థితులు కాస్త కుదుటపడటంతో వీరిద్దరూ విదేశీ విహార యాత్రకు వెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. చూడముచ్చటైన జంట అంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం రానా ‘విరాటపర్వం’ ‘అరణ్య’ ‘1946’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో కొన్ని నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్నాయి.logo