మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 04, 2020 , 10:54:08

బ‌యో సెక్యూర్ వాతావ‌ర‌ణంలో రానా-మిహికాల వివాహం

బ‌యో సెక్యూర్ వాతావ‌ర‌ణంలో రానా-మిహికాల వివాహం

టాలీవుడ్ హీరో రానా ద‌గ్గుబాటి వివాహం త‌న ప్రేయ‌సి మిహికా బ‌జాజ్‌తో ఆగ‌స్ట్ 8న జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎంతో ఘ‌నంగా జ‌ర‌గాల్సిన వీరి వివాహం కరోనా వ‌ల‌న సాదాసీదాగా జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే రానా వివాహ వేదిక‌కి సంబంధించి కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్న నేప‌థ్యంలో దగ్గుబాటి ఫ్యామిలీ స్పందించింది.

హైద‌రాబాద్‌లోని ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో రానా వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్టు ప్ర‌చారం చేయ‌గా, దానిని ఖండించిన కుటుంబ స‌భ్యులు రామానాయుడు స్టూడియోలోనే రోకా వేడుక మాదిరిగా సింపుల్‌గా పెళ్ళి తంతు జ‌రిపిస్తామ‌ని అన్నారు. 30 మంది లోపే వివాహానికి హాజ‌రు కానున్నారు. కుటుంబ స‌భ్యుల‌కి సంబంధించి కొద్ది మాత్ర‌మే పెళ్ళికి హాజ‌రు కానున్నారు. శ్రేయోభిలాషులు, స‌న్నిహితుల‌ని కూడా ఆహ్వానించ‌డం లేదు. 

కోవిడ్ 19 విస్తృతంగా వ్యాపిస్తున్న నేప‌థ్యంలో రిస్క్ చేయాల‌ని ఏ మాత్రం భావించ‌డం లేదు. సింపుల్‌గా, అందంగా వివాహా వేడుక‌ని ప్లాన్ చేశాం . బ‌యో సెక్యూర్ వాతావ‌ర‌ణంలో పెళ్లి వేడుక‌ని నిర్వ‌హించ‌నుండ‌గా, అతిధులు త‌ప్ప‌ని స‌రిగా తగు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని హెచ్చ‌రించాం. పెళ్ళికి హాజ‌ర‌య్యే వారు కోవిడ్ 19 ప‌రీక్ష‌లు త‌ప్ప‌ని స‌రిగా జ‌రిపించుకోవాలి. మేం కూడా వేదిక ప‌రిస‌ర ప్రాంతాల‌లో శానిటైజ్ చేయించ‌డంతో పాటు అంద‌రు భౌతిక దూరం పాటించేలా త‌గు ఏర్పాట్లు చేస్తున్నాం అని సురేష్ బాబు పేర్కొన్నారు. మిహికా త‌ల్లి కూడా జాగ్ర‌త్త‌ల విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌ట్లేదు అని పేర్కొన్నారు. 

తాజావార్తలు


logo