ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 15, 2020 , 01:04:04

శోభన్‌బాబు బయోపిక్‌లో..

శోభన్‌బాబు బయోపిక్‌లో..


భాషాభేదాలకు అతీతంగా భిన్న రంగాలకు చెందిన అలనాటి ప్రముఖుల జీవితాల్ని వెండితెరపై ఆవిష్కృతం చేసే ట్రెండ్‌ కొనసాగుతుంది. ముఖ్యంగా సినీ తారల జీవితాలపై ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తుండటంతో వారి బయోపిక్‌లకు సంబంధించి కథల్ని సిద్ధంచేస్తున్నారు.   తాజాగా దివంగత అగ్రకథానాయకుడు శోభన్‌బాబు జీవితం ఆధారంగా ఓ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన సినీ ప్రయాణంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ బయోపిక్‌లో శోభన్‌బాబు పాత్రలో రానా నటించబోతున్నట్లు తెలిసింది. ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. శోభన్‌బాబు కుటుంబసభ్యులతో నిర్మాణ సంస్థ సంప్రదింపులు జరిపినట్లు, వారు ఈ బయోపిక్‌కు అంగీకారం చెప్పినట్లు తెలిసింది. 

Rana not starring in senior hero’s rumored biopiclogo