బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో తొలి సీజన్‌ని ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో సీజన్‌ని నాని, మూడు, నాలుగు సీజన్స్‌ని నాగార్జున హోస్ట్ చేశారు. ఐదో సీజన్ ఎవరు హోస్ట్ చేస్తారు అనే దానిపై అందరిలో సందేహాలు నెలకొన్నాయి. నాగార్జుననే హోస్ట్ అని కొద్ది రోజులు ప్రచారం జరిగింది. ఆ తర్వాత రానా అని వైరల్ చేశారు.
ఇప్పుడు రానా బిగ్ బాస్ హోస్ట్‌గా ఉండడం ఖాయమని లీకు రాయుళ్లు చెప్పుకొస్తున్నారు. వంద శాతం ఈ సమాచారం నిజమైందేనని ఊదరకొడుతున్నారు. మరి ఒకవేళ ఈ వార్త నిజమైతే బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంకు మంచి టీఆర్పీ రేటింగ్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే రానా పలు బుల్లితెర కార్యక్రమాలను హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. సీజన్ 5 ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ షో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. టీవీ యాంకర్లు, యూట్యూబ్ స్టార్ల మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.