శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 22, 2020 , 23:07:31

పువ్వు మీద ముద్దుపెట్టి..

పువ్వు మీద ముద్దుపెట్టి..

‘మిహీక బజాజ్‌ తన ప్రేమకు ఓకే చెప్పిందంటూ’ ఇటీవలే  సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు హీరో రానా . వీరి ప్రేమాయణానికి ఇరు కుటుంబాల వారు అంగీకారం తెలిపారు.  ఈ నేపథ్యంలో తన ప్రేమాయణంపై ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పలు విషయాల్ని వెల్లడించారు రానా . మిహీక బజాజ్‌ తన బాబాయ్‌ వెంకటేష్‌ పెద్ద కూతురు అశ్రిత క్లాస్‌మేట్‌ అని తెలిపారు. లాక్‌డౌన్‌ ముందు తమ ప్రేమ ఫలించిందని చెప్పారు.  ‘చాలా కాలంగా మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది. ఆమె నా  జీవితభాగస్వామిగా సరైన అమ్మాయి అనిపించింది.  మంచి పనులు జరుగుతున్నప్పుడు ఎక్కువగా లెక్కలు వేయకూడదు.  తనను కలిసి నా ప్రేమను వ్యక్తం చేశాను.  జీవితాంతం తనతో సంతోషంగా ఉండగలననే నమ్మకం కలిగింది. పెళ్లి చేసుకుందామని అనగానే షాక్‌లోనే మిహీక ఒకే చెప్పింది. మా ప్రేమ వ్యవహారం ఎలాంటి కాంప్లికేషన్స్‌ లేకుండా చాలా సింపుల్‌గా సాగింది. మా గురించి చెప్పిన తర్వాత  కుటుంబసభ్యులందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మంచి నిర్ణయమని సంతోషపడుతున్నారు.  నా పెళ్లి  గురించి అమ్మనాన్నలు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. చివరకు పెళ్లికి ఓకే చెప్పడంతా అందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు. మిహీక హైదరాబాద్‌ అమ్మాయే. జూబ్లీహిల్స్‌లోనే ఉంటుంది. తెలుగు ఫర్‌ఫెక్ట్‌గా రాదు.  అలాగే ముంబయిలోనూ మా ఇద్దరికి కామన్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారు. ఈ మధ్య జరిగిన రోకా వేడుకలో పువ్వుపై ముద్దు పెట్టి ఆమెకు విసిరాను.  మా ప్రేమ గురించి తెలిసి స్నేహితులు సంతోషపడ్డారు. మాజీలు ఆశీర్వదిస్తూ మెసేజ్‌లు పెట్టారు’ అని తెలిపారు. 


logo