మంగళవారం 02 జూన్ 2020
Cinema - Mar 11, 2020 , 13:02:52

ఆర్ఆర్ఆర్‌లో రానాకి జ‌త‌గా ముగ్గురు హీరోయిన్స్‌..!

ఆర్ఆర్ఆర్‌లో రానాకి జ‌త‌గా ముగ్గురు హీరోయిన్స్‌..!

ఆర్ఆర్ఆర్ అంటే మ‌న‌కి ఠ‌క్కున గుర్తొచ్చే సినిమా ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం. ఈ మూవీ గ‌త కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్ అనే టైటిల్‌తోనే ప్ర‌చారం జ‌రుపుకుంటుండ‌గా, పూర్తి పేరు ఏంట‌నే విష‌యంపై క్లారిటీ లేదు. ఇక‌ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టైటిల్‌తోనే తేజ ఓ చిత్రం తెర‌కెక్కిస్తున్నాడు. ఇక్క‌డ ఆర్ఆర్ఆర్ అంటే రాక్ష‌స రాజ్యంలో రావ‌ణాసురుడు. బాహుబ‌లి స్టార్ రానా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఇందులో రానా పాత్ర నెగెటివ్ షేడ్‌లో ఉంటుంద‌ని వార్తలు వ‌స్తున్నాయి. అంతేకాదు రానా ముగ్గురు భామ‌ల‌తో రొమాన్స్ చేయ‌నున్నాడ‌ట‌. నేనే రాజు నేనే మంత్రిలో రానా స‌ర‌స‌న న‌టించిన కాజ‌ల్ అగ‌ర్వాల్ ఓ హీరోయిన్ కాగా, మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్ ఎవ‌ర‌నేది తెలియాల్సి ఉంద‌ని అంటున్నారు. రానా ప్ర‌స్తుతం అర‌ణ్య అనే సినిమాతో పాటు విరాట‌ప‌ర్వం అనే చిత్రాలు చేస్తున్నారు. 


logo