శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 17, 2020 , 15:13:35

రానా, మిహికాల స్ట‌న్నింగ్ ఫొటో వైర‌ల్

రానా, మిహికాల స్ట‌న్నింగ్ ఫొటో వైర‌ల్

లాక్‌డౌన్ స‌మ‌యంలో కొద్ది మ‌ద్ది అతిథుల మ‌ధ్య రానా- మిహికా బ‌జాజ్‌లు పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్ట్ 8న వీరి వివాహం సింపుల్‌గా జ‌ర‌గ‌గా, పెళ్ళికి సంబంధించిన కొన్ని ఫోటోల‌ని బ‌య‌ట‌కు విడుద‌ల చేశారు. ఇవి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. ఇక పెళ్ళి త‌ర్వాత జ‌రిగిన వ్ర‌తంకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి.

తాజాగా రానా, మిహికాకి సంబంధించిన ఓ ఫోటో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. ఏదో ప్ర‌దేశంలో ఈ నూత‌న జంట ఎంజాయ్ చేస్తూ ఫోటోకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోని మిహికా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా, ఫ్యాన్స్ కామెంట్స్‌, లైకుల‌తో ఈ ఫోటోని ట్రెండింగ్‌లోకి వ‌చ్చేలా చేస్తున్నారు. మరోవైపు రానా- మిహికా ప్ర‌స్తుతం హ‌నీమూన్ ట్రిప్‌లో ఉన్నార‌ని, ఆ సంద‌ర్భంలో దిగిన ఫోటోనే ఇది అంటూ కొంద‌రు ఆ ఫోటోకు కామెంట్స్ పెడుతున్నారు.