‘డేనియర్ శేఖర్..రిటైర్డ్ ఆర్మీ అధికారి. అహంభావమనస్తత్వం కలిగిన అతడికి పోలీస్ అధికారి భీమ్లానాయక్‌తో ఎందుకు వైరం ఏర్పడిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు సాగర్ కె చంద్ర. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్’. పవన్‌కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, సంభాణలు సమకూర్చుతున్నారు. సోమవారం రానా పాత్ర తాలూకు కర్టెన్ రైజర్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో ‘నీ మొగుడు గబ్బర్‌సింగ్ అంట. స్టేషన్లో టాక్ నడుస్తోంది. నేనెవరో తెలుసా..ధర్మేంద్ర హీరో’ అంటూ రానా చెప్పిన డైలాగ్ ఆసక్తిని పంచుతోంది. ‘యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రస్తుతం షూటింగ్ జరుపుతున్నాం. 2022 జనవరి 12న సినిమాను విడుదలచేస్తాం’ అని చిత్రబృందం తెలిపింది.