సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Oct 09, 2020 , 11:29:16

ఈ వారం బిగ్ బాస్ హోస్ట్ మార‌నున్నారా..!

ఈ వారం బిగ్ బాస్ హోస్ట్ మార‌నున్నారా..!

బిగ్ బాస్ సీజ‌న్ 3తో పాటు సీజ‌న్‌4లను స‌క్సెస్‌ఫుల్‌గా న‌డిపిస్తున్న నాగార్జున కొద్ది రోజుల పాటు షోకు దూరంగా ఉండ‌నున్నార‌నే ప్ర‌చారం జోరుగా న‌డుస్తుంది. ప్ర‌స్తుతం వైల్డ్ డాగ్ అనే చిత్ర షూటింగ్ చేస్తున్న నాగ్, ఈ మూవీ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొనేందుకు థాయ్‌లాండ్ వెళ్లార‌ట‌. ఆయ‌న కొద్ది రోజుల పాటు అక్క‌డే ఉండ‌నున్న నేప‌థ్యంలో నాగార్జున స్థానాన్ని వేరే వారితో భ‌ర్తీ చేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట నిర్వాహ‌కులు.

గ‌త సీజ‌న్స్‌ని హోస్ట్ చేసిన ఎన్టీఆర్,నానిలు కూడా ప్ర‌స్తుతం షూటింగ్స్‌తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో సీజ‌న్ 3లో గెస్ట్ హోస్ట్‌గా వ‌చ్చిన ర‌మ్య‌కృష్ణ  వైపే నిర్వాహ‌కులు ఆస‌క్తి చూపుతున్న‌ట్టు టాక్.  ఈ వారం శ‌ని, ఆది వారాల‌లో ర‌మ్య‌కృష్ణనే బిగ్ బాస్ షోని హోస్ట్ చేయ‌నుంద‌ని, త‌న మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని రంజింప‌జేయ‌నుంద‌ని తెలుస్తుంది.


logo