గురువారం 13 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 10:48:36

విశాల్ సీక్రెట్స్ బ‌ట్ట‌బ‌య‌లు చేస్తా..

విశాల్ సీక్రెట్స్ బ‌ట్ట‌బ‌య‌లు చేస్తా..

న‌టుడిగానే కాకుండా నిర్మాతగాను రాణిస్తున్న విశాల్‌కి వడపళని, కుమరన్∙కాలనీలోని చిత్ర నిర్మాణ కార్యాలయం ఉన్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించి ఆదాయ‌శాఖ సంస్థ‌కి డీయస్ స‌రిగా చెల్లించ‌డం లేద‌ని విశాల్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాడు. ఈ వ్య‌వ‌హారంకి సంబంధించి ఎంక్వైరీ చేయ‌గా తమ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేసే రమ్య రూ.45 లక్షలు మోసం చేసిన‌ట్టు తేలింద‌ట‌. దీంతో విశాల్ కార్యాలయ నిర్వాహకుడు హరి స్థానిక సాలిగ్రామంలోని పోలీస్‌ స్టేషన్లో ఈ వ్యవహారంపై పిర్యాదు చేశారు. 

త‌న‌పై ఫిర్యాదు చేయ‌డంతో ర‌మ్య ఓ ఛానల్ ద్వారా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. విశాల్ కొన్నేళ్ళుగా ప్ర‌భుత్వానికి టీడీఎస్ చెల్లించ‌డం లేదు. దీనిని క‌ప్పిపుచ్చుకోవ‌డానికి నా పై ఆరోప‌ణ‌లు చేస్తున్నాడు. హ‌రి వ‌ర్గం అయితే నా ఇంటికి వ‌చ్చి బెదిరింపుల‌కి కూడా దిగారు. వారు చేసే చాలా విష‌యాలు నాకు తెలుసు. వాట‌న్నింటిని బ‌ట్ట‌బ‌యలు చేస్తాను. వారి నుండి నాకు ప్ర‌మాదం పొంచి ఉంది. త‌న‌కి పోలీసులు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరింది ర‌మ్య‌. 


logo