మంగళవారం 26 మే 2020
Cinema - May 13, 2020 , 10:53:58

రాములో రాములా.. సాంగ్ ఖాతాలో కొత్త రికార్డ్

రాములో రాములా.. సాంగ్ ఖాతాలో కొత్త రికార్డ్

సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం అల వైకుంఠ‌పుర‌ములో.  రిలీజ్‌కి ముందే ఈ సినిమా జ‌నాల దృష్టిని ఆక‌ర్షించింది. థ‌మ‌న్ అందించిన బాణీల‌లో ‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాముల’ పాటలు సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. చిత్రంలో ఏ సాంగ్‌కి ఆ సాంగ్ ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. ప్ర‌తీ సాంగ్స్ విదేశీ క్రికెట‌ర్స్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల‌ని కూడా ఆక‌ర్షిస్తున్న సంగ‌తి తెలిసిందే. 

చిత్రంలోని రాములో రాముల  అనే పాట‌ తెలంగాణ యాస‌లో సాగగా, ఈ సాంగ్ ప్రేక్ష‌కుల‌ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది.  కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, మంగ్లి పాడారు. ఈ సాంగ్‌లో బ‌న్నీ వేసిన స్టెప్స్‌ని దోసె స్టెప్స్ అని అల్లు అర్హ కామెంట్ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ యూ ట్యూబ్‌లో 100 మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్ సొంతం చేసుకొని సరికొత్త రికార్డ్‌ని త‌న ఖాతాలో వేసుకుంది. కాగా అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలోని మ‌రో పాట‌ బుట్ట బొమ్మ‌కి 150 మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు.  అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. సుశాంత్‌, నివేదా పేతురాజు, మరళీ శర్మ, టబు తదితరులు ముఖ్య పాత్ర‌లు పోషించారు.
logo