శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 14:13:39

బాలు స్వ‌రం ఓ వ‌రం : రామోజీ రావు

బాలు స్వ‌రం ఓ వ‌రం : రామోజీ రావు

హైద‌రాబాద్ : గాన గాంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతిప‌ట్ల ఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీరావు తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. గుండెల‌కు హ‌త్తుకుని ప్రేమ‌గా ప‌లుక‌రించే ఆత్మీయుడైన త‌మ్ముడు బాలు అని రామోజీరావు భావోద్వేగానికి లోన‌య్యారు. బాలు ఇక లేరంటేనే బాధ‌గా, దిగులుగా ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌పంచ సంగీతానికే బాలు స్వ‌రం ఓ వ‌రం అని కొనియాడారు. బాలు పాటు తేట తియ్య‌ని తేనెల ఊట‌లు. మ‌ధుర గాయ‌కుడి మ‌ర‌ణం మాట‌ల‌కంద‌ర‌ని మ‌హా విషాదం అని రామోజీరావు పేర్కొన్నారు.


logo