ఆదివారం 29 నవంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 15:10:32

రూ.5 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన రామోజీరావు

రూ.5 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన రామోజీరావు

ఎడతెరిపి లేకుండా కురిసిన‌ భారీ వర్షాలు, వరదల మూలంగా హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డ్డారు. చాలా మంది జీవన విధానం చిన్నాభిన్నం అయ్యింది. ప్రజలు పడుతున్న కష్టాలు చూసి వారి స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు, పారిశ్రామిక‌వేత్త‌లు, రాజ‌కీయ నాయ‌కులు ముందుకు వ‌స్తున్నారు. 

తాజాగా రామోజీ గ్రూప్ ఛైర్మ‌న్ రామోజీరావు రూ.5 కోట్ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. వ‌ర‌ద‌ల వ‌ల‌న నిరాశ్ర‌యులైన బాధితుల‌కు ఆహారం, స‌రుకులు అందించేందుకు గాను రూ.5 కోట్ల రూపాయ‌ల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించ‌నున్న‌ట్టు తెలిపారు.