శనివారం 08 ఆగస్టు 2020
Cinema - Jul 31, 2020 , 23:40:24

యథార్థ ఘటన ఆధారంగా రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మర్డర్‌'

యథార్థ ఘటన ఆధారంగా రామ్‌గోపాల్‌వర్మ  తెరకెక్కిస్తున్న చిత్రం  ‘మర్డర్‌'

రామ్‌గోపాల్‌వర్మ  తెరకెక్కిస్తున్న చిత్రం  ‘మర్డర్‌'.  శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సాహితి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆనంద్‌చంద్ర దర్శకుడు. నట్టి కరుణ, క్రాంతి నిర్మాతలు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. యథార్థ ప్రేమ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. రామ్‌గోపాల్‌వర్మ చెప్పినట్లుగా ఇందులో ఎవరి మనోభావాల్ని కించపరచలేదు. రెండుగంటల నిడివి గల ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ నెలలోనే తొలికాపీ సిద్ధమవుతుంది. త్వరలోనే సెన్సార్‌ జరుపుతాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జగదీష్‌, సంగీతం: డీఎస్‌ఆర్‌.


logo