బుధవారం 02 డిసెంబర్ 2020
Cinema - Jul 21, 2020 , 22:32:11

వెంకీ కథకు చరణ్ ఫిదా!

వెంకీ కథకు చరణ్ ఫిదా!

ఛలో, భీష్మ చిత్రాల విజయాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల తన తదుపరి చిత్రం రామ్‌చరణ్‌తో చేయడానికి రెడీ అయ్యాడు. ఇటీవల వెంకీ వినిపించిన కథకు చరణ్‌ ఫిదా అయ్యాడట. ఛలో, భీష్మ చిత్రాల్లో వెంకీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఆకర్షితుడైన రామ్‌చరణ్‌ మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ కథను ఆలోచించమని చెప్పిన వెంటనే వెంకీ చెప్పిన ఐడియా నచ్చి చరణ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడని తెలిసింది.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తున్న చరణ్‌ ఆ తదుపరి  లైటర్‌వెయిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నాడు. అందుకే వెంకీ చెప్పిన కథ పర్‌ఫెక్ట్‌గా వుంటుందని మరో ఆలోచన లేకుండా వెంకీ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఫిక్స్‌ అయ్యాడట చరణ్‌.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.