ఆదివారం 05 జూలై 2020
Cinema - Jun 30, 2020 , 19:24:49

పవన్‌-క్రిష్‌ సినిమాలో రాంచరణ్‌..?

పవన్‌-క్రిష్‌ సినిమాలో రాంచరణ్‌..?

టాలీవుడ్‌ స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, క్రిష్‌ కాంబినేషన్‌లో సినిమావస్తోన్న విషయం తెలిసిందే.  ఈ ప్రాజెక్టుకు విరూపాక్ష అనే టైటిల్‌ ఖరారు చేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. హిస్టారికల్‌ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రాంచరణ్‌ కీలక పాత్రలో నటిస్తాడని టాక్‌ వినిపిస్తోంది.

సైరా చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జర్నీని కొనసాగించే పాత్రలో అనుష్క కనిపించిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో పవన్‌-క్రిష్‌ మూవీలో రాంచరణ్‌ పాత్ర ఉంటుందని టాక్‌ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు వాస్తవం ఉందనేది తెలియాలంటే చిత్రయూనిట్‌ నుంచి ప్రకటన రావాల్సిందే. logo