మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Jul 03, 2020 , 20:23:28

తన సమయాన్ని ఇంటికే కేటాయిస్తున్న రామ్‌చరణ్‌

తన సమయాన్ని ఇంటికే కేటాయిస్తున్న రామ్‌చరణ్‌

ఈ కరోనా లాక్‌డౌన్‌ సమయాన్ని స్టార్‌హీరోలు ఇంటికే కేటాయించారు. ఇంకో మార్గం కూడా లేదనుకోండి. అయితే కొంత మంది స్టార్స్‌ మాత్రం తమ తదుపరి చిత్ర చర్చలు, వాటి సన్నాహాలు చేసుకున్నారు. రామ్‌చరణ్‌ మాత్రం ఇందుకు భిన్నంగా ఈ కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎటువంటి కథా చర్చ ల్లో పాల్గొనలేదు. పూర్తిగా తన సమయాన్నిఇంటికే కేటాయిస్తున్నాడు. ఎవరైనా కనీసం జూమ్‌ ద్వారా కథలు వినమని అడిగినా సున్నితంగా తిరస్కరిస్తున్నాడట. 

ఇటీవల ఓ పాపులర్‌ దర్శకుడికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని తెలిసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రీకరణ పూర్తయ్యే వరకు మరో సినిమాను అంగీకరించకూడదని అనుకున్నాడట చరణ్‌. రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన మాత్రం ఈ లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలను చైతన్యపరిచే పలు సామాజిక కార్యక్రమా ల్లోసోషల్‌మీడియా వేదికగా భాగమైన సంగతి అందరికి తెలిసిందే.


logo